

Mana News,పుత్తూరు:- ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
