

Mana News :- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిందితుడిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని గురువారం ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు లోని ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
