

Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లి కోసం జవాను తల్లడిల్లుతున్నాడు. సోమవారం తిరుపతి కలెక్టర్ ని కలిసి తన తల్లి మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకోమని ఫిర్యాదు చేశాడు.