

Mana News :- నెల్లూరు రంగనాయకులపేట లోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో మార్చి 9 వ తేదీ నుండి 20 వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భముగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.