

Mana News :- నెల్లూరు నగరంలోని టౌనుహాలు లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి “తడి ఆరని వాక్యమొకటి” పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు, సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల,ముక్కామల చక్రధర్,పెరుగు రామకృష్ణ,ఈతకోట సుబ్బారావు,పాతూరి అన్నపూర్ణ , సరసిజ పెనుగొండ, అవ్వారు శ్రీధర్ బాబు మొదలగు ఎందరో సాహితీ ప్రముఖులు హాజరయ్యారు.