మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో నేషనల్ లెవెల్ కరాటే కుంగ్ ఫు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు మెడల్స్ అందజేసినట్లు కరాటే మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ బుడోకాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు తెలంగాణ ,ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి విద్యార్థులు పలు కేటగిరీలలో పాల్గొని మెడల్స్ ప్రశంసాపత్రం గెలుచుకున్నట్లు తెలిపారు. విజేతలకు మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, శంషుద్దీన్ ఇతర నాయకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ మాట్లాడుతూ.. కరాటే తో మెరుగైన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, అదేవిధంగా అందరితోనూ కలిసిమెలిసి ప్రశాంత జీవనం కొనసాగించేందుకు తోడ్పాటు అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు అమ్రేష్ , అంజన్ ప్రసాద్ ఇతర మాస్టర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
