రేణిగుంట.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన పూణేకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘సుభాష్ షుగర్స్ లిమిటెడ్’ అధినేత సుభాష్ లాలాసాహెబ్ దేశ్‌ముఖ్ మరియు వారి కుటుంబ సభ్యులకు తిరుపతి జిల్లా బీఎంఎస్ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ ఘన స్వాగతం పలికారు.
తిరుపతిలోని తాజ్ హోటల్‌లో బస చేసిన సుభాష్ లాలాసాహెబ్ దేశ్‌ముఖ్, వారి కుమారుడు సుశీల్ కుమార్ ఎస్. దేశ్‌ముఖ్, కుటుంబ సభ్యులు సోనాలి ఎస్. దేశ్‌ముఖ్, విజయలక్ష్మి ఎస్. దేశ్‌ముఖ్‌లను పూల వెంకటాద్రి యాదవ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించడమే కాకుండా, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను (విగ్రహాన్ని) బహుకరించారు.
అనంతరం పూల వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ.. “పూణేకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సుభాష్ షుగర్స్ లిమిటెడ్ అధినేత సుభాష్ లాలాసాహెబ్ దేశ్‌ముఖ్, వారి కుమారుడు సుశీల్ కుమార్, కుటుంబ సభ్యులు సోనాలి ఎస్. దేశ్‌ముఖ్, విజయలక్ష్మి ఎస్. దేశ్‌ముఖ్‌లతో కలిసి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమల తిరుపతి క్షేత్రానికి విచ్చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. దేశ పారిశ్రామికాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్న వారిని తిరుపతి జిల్లా బీఎంఎస్ తరఫున శాలువాలతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను అందించి స్వాగతం పలకడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. ఆ ఏడుకొండలవాడి దివ్య ఆశీస్సులు దేశ్‌ముఖ్ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, వారి వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు

