గ్లౌజులు, మాస్కుల పంపిణీ.
మన ధ్యాస మక్తల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పర్యటన లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కలిమి చెర్ల రమేష్ చేతుల మీదుగా మక్తల్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గ్లోజ్ లు, మాస్కు లు పంపిణీ చేసిన అనంతరం కార్మికులను ఘనంగా సన్మానించారు. దీంతోపాటు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి 108 ఏ గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ కల్మచర్ల రమేష్, జిల్లా ఫస్ట్ లేడీ స్రవంతి దంపతులతో పాటు రిజియన్ చైర్మన్ శ్రీకర్ నాగ సావిత్రి సార్, రీజన్ సెక్రెటరీ నీలకంత్ సార్, క్యాబినెట్ ట్రెజరర్ నాగరాజు, జోన్ చైర్ పర్సన్ బెండ సత్యవతి వారి చేతుల మీదుగా మొక్కలు నాటడం, మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్, సన్డైజర్ ఆఫీసర్ చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు మాస్కులు పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికులకు ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ వారు వచ్చిన ముఖ్య అతిథులకు, వాసవి క్లబ్ వారు అతిథిలతో పాటు మున్సిపల్ వారికి సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ గవర్నర్లు కల్వ శ్రీనివాస్, దొంత నరహరి, మాజీ అధ్యక్షులు బిలకంటి నరసయ్య, ఆర్య సంఘం నాయకులు బిలకంటి జగదీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, కార్యదర్శి కొత్త ఆంజనేయులు, కోశాధికారి తలంపల్లి పవన్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, శానిటైజర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
