కలిగిరి, నవంబర్ 5, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలంలోని వెలగపాడు గ్రామ పంచాయతీకి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా గొల్లపూడి వసంత బరిలోకి దిగుతున్నా ట్లు సమాచారం.కలిగిరి మండలంలో సీనియర్ నాయకులు గొల్లపూడి ప్రసాదరావు సతీమణి అయిన గొల్లపూడి వసంత వెలగపాడు సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈమెకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మద్దతు తెలిపినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నారు.గొల్లపూడి కుటుంబానికి వెలగపాడు గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రసాదరావు ఎన్నో ఏళ్లుగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఆ అనుభవంతో, ఆయన సతీమణి వసంత కూడా గ్రామ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు.తాను సర్పంచ్ గా గెలుపొందిన వెంటనే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని గొల్లపూడి వసంత తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా గ్రామంలోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపడతానని ఆమె హామీ ఇచ్చారు.అదేవిధంగా వెలగపాడు పంచాయతీకి సంబంధించి పెద్ద అన్నలూరు, వెలగపాడు కొత్తూరు, కమ్మవారిపాలెం గ్రామాలలో కూడా ప్రజలు ఆమెకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. మూడు గ్రామాల ప్రజలు, పెద్దలు, యువత అందరూ ఏకతాటిపైకి వచ్చి గొల్లపూడి వసంత గెలుపు కోసం కృషి చేస్తున్నారు.వెలగపాడు పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గొల్లపూడి వసంత అన్నారు.
