రేణిగుంట, నవంబర్ 13:
​మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్‌కు తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ జయచంద్ర తెలిపారు.
​రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, తిమ్మానగర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ జి. వెంకటరెడ్డి (65) మద్యం సేవించి టీఎస్ 29 టీఎం 1149 నంబరు గల లారీని నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నంబర్ 550/2026 ( ఎస్ టి సి నంబర్ 5057/2026), మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185(ఏ ) కింద కేసు నమోదు చేశారు.
​నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతను తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం 10 రోజుల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని సీఐ జయచంద్ర పేర్కొన్నారు.
​ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *