నిజాంసాగర్, సెప్టెంబర్ 27 (మన న్యూస్): నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహాజన సభను సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 01-04-2026 నుంచి 26-09-2026 వరకు సొసైటీలో జరిగిన ఆదాయ, వ్యయాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సీఈఓ సాయిలు సభలో చదివి వినిపించారు.సొసైటీకి సంబంధించిన ఆర్థిక వివరాలను సభ్యులకు తెలియజేస్తూ, ప్రస్తుతం సొసైటీలో రూ. 19 లక్షల నిధులు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి మరో రూ.30 లక్షలు రావాల్సి ఉందని వివరించారు. సొసైటీ కార్యకలాపాలు, రైతులకు అందుతున్న సేవలపై కూడా సభలో చర్చించారు.అనంతరం చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ ద్వారా రైతులు తీసుకున్న రుణాల్లో కొంతమందికే రుణమాఫీ జరిగిందని, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తీసుకున్న పాత రుణాలను సకాలంలో వసూలు చేయడంతో పాటు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రుణాలు కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే ఎరువుల కోసం యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ పద్ధతిలోనే ఎరువులు అందించేలా చూడాలని కోరారు. రైతులకు సొసైటీ ద్వారా అవసరమైన సహకారం అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామ్‌సింగ్, మండల అధ్యక్షుడు ప్రజా పండరి, వైస్ ఎంపీపీ మనోహర్, మాజీ సర్పంచ్ బాబు సెట్, మల్లూరు తండా సర్పంచ్ నారాయణ, డైరెక్టర్లు మారెడ్డి వెంకట్రాంరెడ్డి, షైను, శ్రీనివాస్ రెడ్డి,నాయకులు ఊరటి వెంకట్ ,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *