మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:-ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మరికల్ పరిధిలోని జాతీయ రహదారి 167 పై రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు ప్రధాన రోడ్ల పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలనలు నిర్వహించినట్లు మరికల్ సిఐ భగవంత్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మరికల్ సిఐ భగవంత్ రెడ్డి, ఎస్సై రాము R& B AE అభిలాష్, నేషనల్ హైవే అథారిటీ నాగవర్ధన్ అధికారుల బృందం జాతీయ రహదారి 167 పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న బ్లాక్ స్పాట్స్ నీ కొన్ని గుర్తించడం జరిగిందని అవి తీలేరు గేటు, సిసీ కుంట రోడ్డు, పసుపుల రోడ్డు, శ్రీవాణి స్కూలు వద్ద ఉన్నాయని మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను సమీక్షించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, రోడ్డు వెడల్పు లోపం, స్పీడ్ బ్రేకర్ల లేమి, మలుపుల వద్ద, సరైన సైన్ బోర్డులు లేకపోవడం, టౌన్ లలో రోడ్డు పై వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై అధికారుల దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.ఈ పరిశీలనలో గుర్తించిన సమస్యలను త్వరలో నిర్వహించే రోడ్ సేఫ్టీ మీటింగ్లో చర్చించి, సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సూచిక బోర్డుల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం చేయాలని, ఓవర్ స్పీడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు.