మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ )హైదరాబాద్ గాంధీభవన్‌లో కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన బీ ఫామ్స్ లను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.అనంతరం కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు బీ ఫామ్స్ లను అధికారికంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు దృష్టికి తీసుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర మంత్రివర్యులు అజారుద్దీన్,రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ,
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్,జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు,ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *