మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా పరిధిలోనిమక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ముఖ్య లక్ష్యంతో మక్తల్ పోలీసులు, హైవే అథారిటీ, రోడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా గురయ్యే బ్లాక్ స్పాట్స్ బస్టాండ్ ఏరియా, నల్లజానమ్మ టెంపుల్ రోడ్డు, దండు రోడ్, చందాపూర్, కనక పరమేశ్వరి టెంపుల్ రోడ్డు తదితర ప్రదేశాలను పరిశీలించి ప్రమాదాలకు కారణమవుతున్న వాటిని గుర్తించి త్వరలో ఓవర్ స్పీడ్ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ వివరాలను జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే హైవే అథారిటీ 167 అధికారులు, రోడ్ సేఫ్టీ అధికారులు, సైన్ బోర్డ్స్, రంబుల్ టిప్స్, స్పీడ్ బ్రేకర్లు, ఐమాక్స్ లైట్లు, బ్లింకింగ్ లైట్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని తెలిపారు.అలాగే పట్టణ కేంద్రంలో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, ముఖ్యంగా హోటళ్ల ముందు, వివిధ బ్యాంకుల ముందు, షాపుల సమీపంలో రోడ్లపై వాహనాలు నిలిపివేయడం వల్ల రోడ్డు ప్రమాదాల పెరుగుతున్నట్లు, అందుకు గాను ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించి, వాహనాల పార్కింగ్ రోడ్లపై జరగకుండా, కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే జరిగేలా చూడాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు మరింత పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని సిఐ స్పష్టం చేశారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ పరిశీలనలో మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి,167 హైవే అథారిటీ అధికారులు, రోడ్ సేఫ్టీ ఈ ఈ వెంకటరమణ, మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారూ.