మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నామినేషన్ల ప్రకియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చివరి రోజు నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉందని, సాయంత్రం 5 గంటల లోపు కేంద్రంలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా.. టోకెన్ లు ఇచ్చి వారి నుంచి నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ ఆర్ వో లకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ మక్తల్ మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు , అఫిడవిట్లు, అవసరమైన ఇతర ధ్రువ పత్రాలు తీసుకుంటున్నారా లేదా అని అడిగి mkm బి సితెలుసుకున్నారు. అక్కడ నామినేషన్లు దాఖలు చేస్తున్న ఒకరిద్దరు అభ్యర్థులతో మాట్లాడిన కలెక్టర్ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి వాకబు చేశారు. కేంద్రాలలో వీడియో గ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు ను చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలోని నాలుగు .మున్సిపాలిటీల లో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, శనివారం స్క్రూటినీ నిర్వహించిన తర్వాత ఫిబ్రవరి 1న అప్పీలు అవకాశం, 2న డిస్పోజల్ అప్పీల్స్, 3 న నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని, 11 న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కోసం ఆయా పట్టణాలలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం మక్తల్ మినీ స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ (ఓట్ల లెక్కింపు)సెంటర్ ను ఆమె తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల లో అన్ని ఏర్పాట్లు, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, బారికేడ్ వ్యవస్తను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల సామాగ్రి పంపిణీ ( డిస్ట్రిబ్యూషన్/ రిసెప్షన్) సెంటర్ ను విశాలమైన మిని స్టేడియంలో ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల వద్ద భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్, తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రాములు, సీ. ఐ రామ్ లాల్, మున్సిపల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
