మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:-
.నామినేషన్ కేంద్రాల వద్ద 164 BNSS (144 Crpc) సెక్షన్ అమల్లో ఉంది.
.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి.
.ముందస్తు ర్యాలీల, మైక్ పర్మిషన్లు తీసుకోవాలి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.నారాయణపేట, మద్దూర్,మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద 164 BNSS (144Crpc) సెక్షన్ అమల్లో ఉందని, 200 మీటర్ల పరిధిలో గుంపులు గుంపులుగా ఎవరు ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులకే అనుమతి ఉంటుందని తెలిపారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, వాహనాల మైక్ వినియోగానికి ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని సూచించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇంతకు ముందు గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ తో పాటు ఎస్ బి,ఎస్ ఐ నరేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసులు పాల్గోన్నారు.
