విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ ఉచితంగా స్కాలర్షిప్ పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
చెన్నై కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింగరాయకొండ మరియు శానంపూడి ఉన్నత పాఠశాలలోని ఎంపిక కాబడిన 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఉచితంగా పంపిణీ చేశారు.ఉల్లాస్ ట్రస్ట్ ప్రతినిధి దింటకుర్తి బాలకృష్ణ విద్యార్థినిలకు ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన ప్రముఖులను గురించి ఇన్స్పిరేషన్ అందించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఉల్లాస్ ట్రస్ట్ ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ విధంగా అందిస్తున్నామన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రెస్ వెల్, స్పీక్ వెల్, బిహేవ్ వెల్ అనే అంశాలను గురించి వివరించారు.విద్యార్థిని విద్యార్థులు చక్కని వేషధారణతో పాటు, మృధువైన సరళమైన బాషతో ఇతరులతో సత్ప్రవర్తనగా మెలగాలన్నారు.చక్కని వేషధారణ తమలో ఆత్మ విశ్వాసం నింపుతుందని,సరళమైన భాష తన తోటి వారితో స్నేహం పెంపొందిస్తుందని అదేవిధంగా మన సత్ప్రవర్తన మంచి వ్యక్తిత్వంతో పాటుగా మనలను ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె మహాలక్ష్మి,వీరమ్మ, దింటకుర్తి శిరీష, ఉపాధ్యాయులు సుధాకర్,పి కోటేశ్వరరావు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.







