మన ద్యాస, సాలూరు :- జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకు ఎంపి డాక్టర్ తనూజా రాణి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ ని కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో కలుషిత నీరు త్రాగి ఇరువురు గిరిజన విద్యార్థినిలు మృతి చెందిన సంఘటన విషయమై పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపి డాక్టర్ మద్దెల గురు మూర్తి, అరకు ఎంఎల్ఎ రేగం మత్స్యలింగం, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, పాముల పుష్ప వాణి, పాడేరు మాజీ ఎంఎల్ఎ భాగ్య లక్ష్మి, జిసిసి మాజీ చైర్ పర్సన్ స్వాతీ రాణి, పార్వతీ పురం మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు తదితరులు పాల్గొన్నారు.







