

*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడం సాంకేతిక విద్యలో అంతే ముఖ్యమైన అంశం. ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉండాలంటే, ఈ నైపుణ్యం తప్పనిసరి. మేము తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు గర్వపడుతున్నాం” అని తెలిపారు.కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఏ. గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, “ఇక్కడి విద్యార్థినులు యూనివర్సిటీ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు” అని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, “విద్యార్థులకు అవసరమైన కమ్యూనికేషన్ ట్రైనింగ్‌ను కళాశాల ప్రాంగణంలోనే నిర్వహిస్తాం” అని తెలిపారు.ఈ సందర్భంగా ఎవోపీ వెంకటేశ్వర్లు గారు ఆరోగ్యం గొప్ప భాగ్యం అని పేర్కొంటూ విద్యార్థినులు క్రీడలలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. హెచ్‌వోడీలు నాగర్జున, వసుమతి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
