ప్రజా రక్షణ సేవే ధ్యేయం. ఉరవకొండ మన న్యూస్ : కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదలతో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీస్ గా ఎంపికయ్యారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల కు సేవలందించడమే తమ కర్తవ్యం గా భావించి ఆ దిశలో అడుగులు వేసింది. తద్వారా పోలీసు ఉద్యోగం పొందింది. కర్తవ్యం సినిమాను చూసి విజయశాంతి ప్రేరణతో ఆమె పోలీస్ ఉద్యోగం సంపాదించింది
అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని చాబాల గ్రామానికి చెందిన ఆకుల విజయలక్ష్మి పోలీసు ఉద్యోగం సంపాదించారు.
గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం విజయలక్ష్మి ది. చాబాలా గ్రామానికి చెందిన ఆకుల బస్సమ్మ, శంకరయ్య దంపతుల కు ముగ్గురు సంతానం కలుగగా ఒక్క కొడుకు ఇద్దరు ఆడ కూతుర్లు జన్మించారు అందులో 3వ కూతురు విజయ లక్ష్మి ఈ నెల శుక్రవారం రోజు సివిల్ కానిస్టేబుల్ ఫలితాల్లో 114మార్కులతో విజయలక్ష్మి సాధించిందిబోయ శంకరయ్య బోయ బసమ్మ కూతురు విజయలక్ష్మి చాబాల గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం పట్టుదలతో గవర్నమెంట్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెళ్లి విరిసింది. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్ల ఉద్యోగం సంపాదించానని గర్వంగా తెలియజేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగం నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.