నిజాంసాగర్, అక్టోబర్ 1 (మన ధ్యాస ): నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ నర్మల రాజు ముగ్గు పోసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ తెలిపారు.మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సాయి తేజ, పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ, జీపీవో దిలీప్, ఐకేపీ సీసీ హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ జనార్దన్, నాయకులు నవీన్‌రెడ్డి, కృష్ణ, హన్మాండ్లు, రాములు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.