ఆర్.ఎం.పి వైద్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు)కు ఘన సన్మానం..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామీణ వైద్యులు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు)కు పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ లో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆర్.ఎం.పి వైద్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు)కు జేజిఆర్ హాస్పటల్ డాక్టర్ జోగ వీర బాలాజీ, డాక్టర్ జోగా శ్రీలత మరియు రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ళ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన్యుని సత్యనారాయణ (కోటిబాబు) చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ సమావేశంలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ళ గణపతి రావు మాట్లాడుతూ ఆర్.ఎం.పి వైద్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు) అన్నవరం,తేటగుంట పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారని. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి తన వంతు వైద్య సేవలు అందిస్తున్నారని మరియు కరోనా సమయంలో గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా కూరగాయలు, భోజనాలు, మజ్జిగ, మంచినీరు వంటి పంపిణీ కార్యక్రమాలు చేసిన అన్నవరం ఆర్.ఎం.పి వైద్యులు మెరుకుర్తి దాసు (దేవదాసు) ఘనంగా సన్మానం చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులకు పిఠాపురం జేజిఆర్ హాస్పిటల్ డాక్టర్స్ , డాక్టర్ జోగా వీర బాలాజీ (ఎం.డి, జనరల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్ ),డాక్టర్ శ్రీమతి జోగా శ్రీలత (ఎం.బి.బి.ఎస్, డి జి ఓ)గార్లచే సీజనల్ వ్యాధులు పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమం నకు బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన్యుని సత్యనారాయణ (కోటిబాబు) రాష్ట్ర కోశాధికారి యండపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లాడి ఈశ్వరరావు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రపు వినోద్ కుమార్. గ్రంధి వెంకటరమణ, రాజన్న రాజేష్, సతీష్, డాక్టర్ వైయస్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సుమారు 200 మంది బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు