నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 1, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో చైర్మన్ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.2,461, దొడ్డు రకం వడ్లకు రూ.2,441 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500రూపాయలు బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు.రైతులు వడ్లను బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని నాగిరెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి హన్మాండ్లు, వైస్ చైర్మన్ గంగా గౌడ్, పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్ప పటేల్, నాగు, గంగారెడ్డి, సాయిలు, కిషన్, పోచయ్య, రవి నాయక్,మల్లేష్, భూమన్న, రసూల్ పటేల్, హనుమండ్లు పటేల్, పాండు నాయక్,భారత్యానాయక్ ,హాజీ, సాయి ప్రసాద్, నాగన్న, చందా నాయక్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *