​ మహారాష్ట్ర నేషనల్ మీట్‌కు కరకంబాడి క్రీడాకారులు ఎంపిక.. రేణిగుంట అక్టోబర్ 1.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీలోని ‘శ్రీ లక్ష్మీదేవి స్పోర్ట్స్ అకాడమీ’ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. ఈ అకాడమీని సి. రెడ్డప్ప స్థాపించగా, ఆయన కుమారుడు సి. రెడ్డి కుమార్ (ఫిజికల్ డైరెక్టర్) అకాడమీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తున్నారు.
​మహారాష్ట్రలోని నాందేడ్‌లో (అక్టోబర్ 29 నుండి నవంబర్ 01 వరకు) జరగనున్న జాతీయ స్థాయి జంప్ రోప్ (స్కిప్పింగ్) పోటీలకు అకాడమీకి చెందిన అండర్-12, అండర్-14 విభాగాల్లో పి. చందు, పి. రామ్‌సాయి, కె. మహేష్ బాబు, డి. హిందూమతి, గగన్ దీప ఎంపికయ్యారు.
​ఈ అకాడమీలో జంప్ రోప్‌తో పాటు వాలీబాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, ఫుట్‌బాల్, క్రికెట్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో రోజూ ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడలతో పాటు విద్యార్థుల చదువు, మానసిక ఏకాగ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
​ఈ సందర్భంగా సి. రెడ్డి కుమార్ మాట్లాడుతూ — “నేటి పోటీ ప్రపంచంలో ఆటల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తాయి. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో శిక్షణ పొందడం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది” అని పేర్కొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *