గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని శాంతి నగర్ లోని ఒకటో వార్డు సచివాలయం వద్ద మంగళవారం రోజు అదాని స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని సి.పి.ఎం నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీ.పీ.యం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి.శివ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు స్మార్ట్ మీటర్లు వల్ల విద్యుత్ బిల్లులు భారంగా మారాయని అదానికి కోట్లు కూడపెట్టేందుకే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం పై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు. ఆదాని స్మార్ట్ మీటర్లు బిగింపు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆగస్టు 11 వ తేదీ ఆదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.పి.యం నాయకులు టి.వెంకట రామిరెడ్డి, కెవిపిఎస్ ఎంబేటి చంద్రయ్య, అడపాల ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం,పుట్టా శంకరయ్య. గండి కోట మధు,బి.చంద్రయ్య, పామంజి మణి, ఏ.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *