

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైభోగల సుబ్బారావును యాదవ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వైభోగం సుబ్బారావు మాట్లాడుతూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా సొసైటీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రైతులు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి పరిష్కరిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గొంప శివకుమార్,కిలాడి శ్రీను,రేఖ గంగాధర్,కోరాడ శివ,దేవర పోతురాజు,ఈపు అప్పారావు,కంచు పోయిన దుర్గాప్రసాద్, కోన గంగాధర్, సంకర రాజు,ఉగ్గిన బుజ్జి,గొలగాని మణికంఠ తదితరులు పాల్గొన్నారు.