

త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో
తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని వచ్చిన ఫిర్యాదు
అక్రమ మార్గంలో సెకండరీ గ్రేడ్ తెలుగు ఉపాధ్యాయుడి నుండి స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ ఉపాధ్యాయుడు గా పొందిన పదోన్నతి నుండి తొలగించాలని కలెక్టర్ కి ఫిర్యాదు
విచారణ జరిపి కలెక్టర్ కి నివేదిక ఇవ్వనున్న త్రీ సభ్య కమిటి.
మన న్యూస్ సింగరాయకొండ:-
అవినీతి అక్రమాలకు కాదేది అనర్హం అన్న ఆర్యోక్తికి అద్దం పడుతూ అక్రమంగా పొంగిన పదోన్నతి బి సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోటికలపూడి జయరాం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కి ఇచ్చిన వినతిపత్రం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి నియమించిన త్రీ సభ్య కమిటీ మంగళ వారం సింగరాయకొండ మండలం ఉల్లపాలెం ఉన్నత పాఠశాలలో విచారణ చేపట్టింది.
ప్రకాశం జిల్లా విద్యాశాఖ పరిధిలో రెగ్యులర్ తెలుగు పండితుడి గా విధులు నిర్వహిస్తూ వ్యాయామ విద్య పూర్తి చేసి అక్రమ మార్గంలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పొందిన పదోన్నతి నిబంధనల ఉల్లంఘన అక్రమం అని దాని పై సమగ్ర విచారణ జరిపి అక్రమ మార్గంలో పొందిన పదోన్నతిని రద్దు చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ పొరుగు రాష్ట్రం లో శిక్షణ వ్యాయామ విద్యార్థిగా అనుమతి ఎలా పొందాడు? ఎవరు అనుమతి ఇచ్చారు అనే విషయం పై సమగ్ర విచారణ జరిపి శాఖా పరమైన చర్యల తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బి సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోటికలపూడి జయరాం తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు తో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఖాతరు చెయ్యకుండా విచారణ కమిటీ వేయడం లో మీన మీషాలు లెక్క పెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారి చర్యల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బి సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోమవారం తిరిగి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దాని తో ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి కి ఆదేశాలిస్తూ వెంటనే త్రీ సభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దానితో జిల్లా విద్యా శాఖ అధికారి స్పందించి ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి ఆధ్వర్యం లో సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ గరల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి టి త్రీ సభ్య కమిటీ ని నియమించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల తో త్రిసభ్య కమిటీ మంగళ వారం ఉల్లపాలెం ఉన్నత పాఠశాల లో విచారణ చేపట్టింది. బి సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోటికలపూడి జయరాం ఇచ్చిన ఫిర్యాదు లోని అన్ని అంశాల పై జిల్లా కలెక్టర్ నియించిన త్రీ సభ్య కమిటీ సమగ్ర విచారణ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నివేదిక సమర్పించేందుకు త్రీ సభ్య కమిటీ చర్యలు చేపట్టింది.