

మన న్యూస్ సింగరాయకొండ:-
“మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఐ హజ రత్తయ్య గారు మాట్లాడుతూ. మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు అందరూ కలిసి పని చేయాలన్నారు అక్రమ రవాణాపై అందరికీ అవగాహన కల్పించి పిల్లల్ని కాపాడాలని
బాల్య వివాహాలు, బాల కార్మికులు, వెట్టి చాకిరికి బలవంతపు వలసలు, పూర్తిగా అరికట్టాలని ఆయన అన్నారు.
డైరెక్టర్ జయ కుమార్ మాట్లాడుతూ.
మానవ అక్రమ రవాణా పై జూన్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ రిజ్వాన గారు, మండల స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ చిమట సుధాకర్ గారు, మహిళా పోలీస్ సిబ్బంది, మెత్తల రాజారాం, సాంత్వనా సేవా సమితి బృందం పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.