

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS
మన న్యూస్ సింగరాయకొండ:-
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి గారు హాజరై విద్యార్థులకు తన ప్రయాణాన్ని వివరించారు.తన జీవితంలో వచ్చిన పోరాటాలు, క్రమశిక్షణ, నిబద్ధతతో ఎలా ఐపీఎస్ సాధించగలిగానో విద్యార్థులతో పంచుకున్నారు. “ఎటువంటి విజయమైనా డిసిప్లిన్ మరియు డెడికేషన్‌తో సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయన స్పష్టంగా చెప్పారు. విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడి, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు హర్షాతిరేకంగా సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సైకం వెంకటేశ్వర్లు గారు శ్రీ ఉదయ్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సమయం పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
