

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ గారి సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టబడింది.వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు, తోటానపల్లి గ్రామాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండలం టీడీపీ అధ్యక్షుడు లోకనాథ రెడ్డి, నియోజకవర్గ యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్–04 నాయకుడు చంగల్ రాయ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు సతీష్ నాయుడు, వార్డు మెంబర్ పయినీ, కొమ్మరగుంట బూత్ కన్వీనర్ ముని రాజారెడ్డి, ఇనాం కొత్తూరు మురళీ రెడ్డి, యువ నాయకులు భాను ప్రకాష్, రామకృష్ణాపురం బూత్ కన్వీనర్ పవన్ కుమార్, కొత్త కోట శేఖర్, యువ నాయకులు మునికృష్ణ, సునిల్, నాగార్జున్, హేమాద్రి, కిరణ్, నరేష్, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్, మహిళా కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, మండల డేటా అనలిస్ట్ మారేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే దిశగా కార్యాచరణను చేపట్టాలని నాయకులు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ అందాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.