

గూడూరు, మన న్యూస్ :- మరలా వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద అని
అందరి మనసులో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెబితే తప్పరని తప్పకుండా ఈసారి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని తెలియజేశారని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు . గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వైసిపి పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ,నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ,ఆనం విజయకుమార్ రెడ్డి ,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులుగా ఎంపికైన వారికి పార్టీ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని వీటి గురించి వైసిపి నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు ప్రతి వైసిపి కార్యకర్తకు గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు గుర్తింపు రాలేదని అందరి మనసులో బాధ ఉందని అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారని మాట ఇస్తే తప్పరని అన్నారు ఎమ్మెల్సీ మేరీగ మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు అనేక హామీలు ఇచ్చి గెలిచిన సంవత్సరం కాలంలో పూర్తిస్థాయిలో అమలు చేయలేదని అన్నారు ఈ నెలలోనే మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుని ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ మాజీ అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సర క్రితం జరిగిన ఎన్నికల్లో వైసిపి పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయని ప్రజల వైసిపి పార్టీతోనే ఉన్నారని ఈసారి ఎన్నికలు 2027 లోనే వస్తాయని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు మనము ఉన్నాము అని వైసిపి నాయకులు నమ్మకం కలిగించాలని సూచించారు వైసిపి పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే అధికారులపై న్యాయపరంగా వెళ్తామని అందరం కలిసికట్టుగా పనిచేసే రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీని గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, చేవూరు విజయ్ మోహన్ రెడ్డి. జడ్పిటిసి యామిని భక్తవత్సల రెడ్డి ,బొమ్మిడి శ్రీనివాసులు ,మల్లు విజయ్ కుమార్ రెడ్డి, వాయుగండ్ల నాగరాజు,మల్లు విజయకుమార్ రెడ్డి, ,మండల కన్వీనర్లు,రాష్ట్ర స్థాయీ ,జిల్లాస్తాయీ నాయకులు,అనుబంధ సంస్థ అధ్యక్షులు,యల్లసిరి గోపాల్ రెడ్డి , చేవూరి విజయ మోహన్ రెడ్డి , ,ZPTC,MPTC నాయకులు,మెట్టా రాధా రెడ్డి గారు,సుభాన్,పుర్ణచంద్ర,జోగి నినోద్,నిఖిల్ సాయి, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .
