

మన న్యూస్,రేణిగుంట జూలై 18:– వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, కామరాజు తెలియజేశారు. శుక్రవారం ఆర్. మల్లవరం గ్రామం నందుజడ్పీ. హైస్కూల్ నందు డెంగ్యూ మాసో త్సవాలు సందర్భంగాసీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం సమిష్టి కృషితో వ్యాధుల నివారణకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు. వాతావరణంలో మార్పు వచ్చిందని వ్యాధు లు వచ్చే
అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురికి నీరు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ, చికెన్ గున్య, మలేరియా, బోదకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే కాశి వడబోసిన నీళ్లు తాగాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు జ్వరం, దద్దర్లు, తలనొప్పి, కండరాలు కీళ్లు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇది టైగర్ దోమ టైగర్ దోమ అని కూడా అని కూడా అంటారు అన్నారు. ఏ.డి.ఎస్ ఈజిప్ట్ ఆడ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఉందన్నారు. ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుందన్నారు. అనంతరం హైస్కూల్ హెచ్.ఎం. వెంకటరత్నం మాట్లాడుతూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని తల్లిదండ్రులకు కూడా వ్యాధుల గురించి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, రాఘవేంద్ర, ఏ.ఎన్.ఎం. పావని, ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఆశా కార్యకర్త క్రాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.