

వెదురుకుప్పం, Mana News , జూలై 11:– వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం పట్ల పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల నేతగా గుర్తింపు పొందారు. గ్రామస్థాయిలో పార్టీ బలపడేందుకు ఆయన అందించిన సేవలు మరువలేనివని నాయకులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు నాయకులు పాతగుంటకు వచ్చారు. వీరిలో GD Nellore నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, బూత్ కన్వీనర్ షణ్ముఖ రెడ్డి, జనసేన పార్టీ బూత్ కన్వీనర్ యతేశ్వర్ రెడ్డి, మాంబేడు గ్రామ ప్రధాన కార్యదర్శి యుగంధర్, యువ నాయకులు అరగొండ మురళీమోహన్ రెడ్డి మరియు ముని కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వెంకటరామిరెడ్డి సేవలను గుర్తు చేస్తూ, ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.