

తిరుపతి,Mana News, జూలై 11:-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి ని కలిసిన స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సంప్రదాయబద్ధంగా దుశ్యాలువను అలంకరించి, ఘనంగా సత్కరించారు. ఈ శుభసందర్భంగా వెదురుకుప్పం మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, కోశాధికారి సవిరెడ్డి మురళి పాల్గొని మంత్రి కి తమ అభినందనలు తెలిపారు. బండి సంజయ్‌తో సంభాషించిన నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను మరింత శక్తివంతంగా అమలు చేయాలని కోరారు. దేశ భద్రత, అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర అమోఘమని ప్రశంసించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “ప్రజల ఆశీర్వాదం, నాయకుల సహకారం వల్లే ఈ స్థాయికి చేరగలిగాను. పార్టీ లక్ష్యాల కోసం నిరంతరం పనిచేస్తాను” అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు రావాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తిరుపతి బీజేపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.