

నారాయణపేట, మన న్యూస్ జూలై 11 :- జిల్లాలోని వివిధ మండలాల్లో సేవలందిస్తున్న 108 (వైద్య అంబులెన్స్), 102 (అమ్మ ఒడి), 1962 (మొబైల్ వెటర్నరీ) అంబులెన్సులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు, మందులు, అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఈఎంఆర్ఐ సంస్థ స్టోర్ అధికారి సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షించారు. అంబులెన్స్‌లో తగిన మందులు ఉండేలా చూసుకోవడంతో పాటు, అత్యవసర సమయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందేలా ప్రథమ చికిత్సకు అన్ని ఏర్పాట్లు ఉండాలంటూ సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు.ఈ తనిఖీలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, నారాయణపేట జిల్లా ఈఎంఈ రాఘవేంద్ర, అలాగే అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యభద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.