

నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ సంవత్సరం మొహర్రం వేడుకల్లో భాగంగా జులై 16 న (బుధవారం) రాత్రి సవారి, జులై 17 న (గురువారం) పగలు సవారి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పీర్ల జాతర సందర్భంగా గ్రామంలో ప్రత్యేక అలంకరణలు, భక్తి కార్యక్రమాలు, నినాదాలతో ఊరంతా సందడిగా మారింది.ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాలు, మతపరమైన చాటుపాటులు, సంప్రదాయ తూర్యనాదాల నడుమ పీర్ల ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగనుంది. శాంతియుత వాతావరణంలో సాగే ఈ పండుగకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.