

గూడూరు, మన న్యూస్ :- ఆపరేషన్ “సేఫ్ క్యాంపస్ జోన్”రాష్ట్రవ్యాప్తంగా జూలై 8 నుండి 12 తేది వరకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా , గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెండవ పట్టణంలో అమలు చేయడం జరిగింది. గూడూరు రెండవ పట్టణ సిఐ J. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, రెండవ పట్టణ ఎస్సై గోపాల్ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీ టీమ్ ఏర్పాటుచేశారు. ఈ టీంలో ఇద్దరు మహిళా ఏఎస్సై లు మరియు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ను నియమించారు.ఈసందర్భంగా గురువారం నాడు గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్స్, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల పరిసర ప్రాంతాల్లోని పాన్ షాపులు, బడ్డి కొట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళలో పలు తనిఖీలు నిర్వహించడం జరిగినది. పొగాకు ఉత్పత్తుల విక్రయం విషయంలో చట్ట ఉల్లంఘనలు ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించబడింది.అందులో భాగంగా జరిమానాలు కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
