

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ ప్రజలు చిన్న పెద్ద అని తేడా లేకుండా అడుగుఅడుగున నీళ్లు పోస్తు మౌలాలీ పీర్ల ఘనంగా వేడుకలను నిర్వహించిన్న గ్రామ ప్రజలు.
గురువారం తెల్లవారుజామున 4:00 గంటలకు మౌలాలీ స్వామి పీర్ల కు వివిధ భక్తులు 40 .తులాలు వెండి 150.ధాటిలు ను మౌలాలీ స్వామి పీర్ల కు మొక్కుబడిగా అందజేశారు. అనంతరం మౌలాలీ స్వామి పీర్లను ఊర్లోకీ ఊరేగించే మౌలాలీ స్వామి దర్గా దగ్గర భక్తులు కోలంట్లు, బొడ్డెమ్మ, కర్రసాము,డాన్సులు వివిధ విన్యాసాలుచేసి గ్రామ ప్రజలను ఆకట్టుకునేలా ప్రదర్శించారు అనంతరం మౌలాలీ స్వామి పీర్ల ను ఊర్లో ఉరేగించుకుంటు మౌలాలి కే దిన్ దిన్, దూలె దూలె, అంటు పరుగులు తీశారు తెల్లవారుజామున పీర్ల మసీదులో పెట్టి సాయంత్రం 5:30 సమయంలో మౌలాలీ స్వామి పీర్ల ను మళ్ళీ ఊర్లో వీధుల్లో ఉరేగించి అనంతరం మానవపాడు. గ్రామ సమీపంలో ఉన్న వాగు దగ్గర మొహార్రం చేసి అనంతరం మొహార్రం అనంతరం హస్సేన్ హుస్సేన్ ఆల్పిదహ అంటూ పాటలు పాడుకుంటూ భక్తులు ఊర్లోకీ వస్తారు.

