మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు పుష్ప గుఛ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పరిసరాలను వీరు పరిశీలించి విద్యార్ధులతో ముచ్చటించి విద్యా భోధన, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఎంపీ,‌ఎమ్మెల్యే పాల్గోన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ… పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదువు ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల చదువులపై దృష్టి సారించడం ద్వారా పిల్లలు చదువుల విషయంలో‌ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కీరమంద ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన క్రీడా మైదానం, పాఠశాలకు అవసరమైన టెబుల్స్ ఇతరత్రా సౌఖర్యాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, కుటుంబానికే కాదు, సమాజానికీ గౌరవం తీసుకొచ్చేలా ఎదగాలి” అని ఆకాంక్షించారు. అలాగే పేరెంట్స్ మరియు టీచర్స్ సంయుక్త సహకారంతోనే విద్యార్థులు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గంగాధరనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, మండల‌ పార్టీ అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, మండల నాయకులు జనార్థన్ గౌడ్, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గోన్నారు.

Related Posts

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.…

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు