

మన న్యూస్,తిరుపతి జూలై 10: వ్యాస పౌర్ణమి గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపం నందనవనం దత్తాత్రేయపురం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారం ఉదయం ఆలయ వ్యవస్థాపకులు ఆచార్య కందమూరు శేషయ్య ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా దత్తాత్రేయ స్వామికి శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్త పద్మ నిలయం ప్రారంభించి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు శేషయ్య మాట్లాడుతూ ప్రతిరోజు పూజా కైంకేర్యాలు, నవగ్రహ పూజలు, జపాలు నక్షత్ర శాంతి నిత్య హోమాలు, రుద్రాభిషేకం నామకరణం గృహప్రవేశం వివాహ ముహూర్తములు అన్నప్రాసన తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి గురువారం దత్తాత్రేయ స్వామికి అభిషేకములు శాస్త్రోక్తంగా జరుగుతాయి అన్నారు. కావున భక్తులు విరివిగా హాజరై పూజలో పాల్గొనాలని ఆయన కోరారు.