నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి రైతు దిగుబడుల కోసం ఆలోచించకుండా కనీసం తాను తినే తిండి గింజల వరకైనా ప్రకృతి సేద్య పద్ధతులలో వ్యవసాయం కొనసాగించాలని లేనియెడల ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్స్ కు బిల్లులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అలాగే విచక్షణ రహితంగా ఎరువులు వాడొద్దని దాని వలన పంట భూములు చౌడుబారుతాయని,ఘన, ద్రవ,జీవామృతాలు తయారు చేసుకోవాలని ఒక ఆవు ఉంటే కనీసం ఐదు ఎకరాలు పండించుకోవచ్చని ప్రకృతి సేద్య నిపుణులు చెబుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి రైతు పంటల బీమా నమోదు చేసుకోవాలని వాతావరణ ఆధారిత పంటల భీమా పథకానికి పత్తి పంటకు1923 రూపాయలు అరటి పంటకు 3000 రూపాయలు ఒక ఎకరానికి చెల్లించుకోవాలని ఆఖరి తేదీ జూలై 15 అని అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మొక్కజొన్న పంటకు 334 జూలై 31 వ తారీకు లోగా వరి పంటకు ఎనిమిది వందల రూపాయలు ఆగస్టు 15వ తారీకు లోగా చెల్లించుకుని నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామ సచివాలయం లేదా కామన్ సర్వీస్ సెంటర్లు లేదా పోస్ట్ ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.అనంతరం అధిక మోతాదులో ఎరువులు ఎరువులు వేస్తే వానపాములు ఎంత తొందరగా చనిపోతాయో ప్రయోగాన్ని చేసి చూపించారు అనంతరం గట్లపై మరియు అంతర్పంటలుగా ప్రభుత్వం ద్వారా 100 శాతం రాయితీపై వచ్చే కంది విత్తనాలను గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను సి ఆర్ పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!