

మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి జె పాత్రో పేర్కొన్నారు. బుధవారం నాడు స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ భవనం లో పంచాయితీ పురోగతి సూచిక పై మండలములో గల పంచాయితీ కార్యదర్శులకి , ఇంజనీరింగు సహాయకులకి, డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు బడ్నాన ప్రమీల హాజరయ్యారు. పంచాయితీల్లో నెలకొన్న సమస్యలు పట్ల శ్రద్ధ కనబరిచి పరిష్కార మార్గం చూపించాలని, మీ స్థాయిలో జరగని పరిష్కారము పై స్థాయి అధికారులు అయిన మాకు గాని జిల్లా అధికారులకు గానీ తెలియజేయాలని కోరారు. సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. పంచాయితీలు అభివృద్ధి చెందితే మండలాలు అభివృద్ధి చెందుతాయని మండలాలు అభివృద్ధి చెందుతే జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అదే మాదిరిగా జిల్లా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. మీరంతా అధికారులకు సహకరించి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో పాత్రో ఆదేశించారు. పై శిక్షణ కార్యక్రమానికి ఇ ఓ పి ఆర్ డి తో పాటు అధికార సిబ్బంది హాజరయ్యారు.