

మన న్యూస్ సాలూరు జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం తెలగా వీధికి చెందిన ఇందూరి నాగభూషణరావు గత కొంతకాలంగా సాలూరు టౌన్ మామిడిపల్లి జంక్షన్ వద్ద మణికంఠ ఎలక్ట్రికల్ షాపు నడుపుకొని జీవిస్తుండగా అతని స్నేహితుడైన డబ్బి కృష్ణారావు వద్ద 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని దానికి వడ్డీ కట్టడం కష్టంగా ఉండటం వలన అదే షాపును డబ్బి కృష్ణారావుకు 75 లక్షలకు అమ్మగా డబ్బి కృష్ణారావు కు రావలసిన 40 లక్షల రూపాయలను తీసుకొని పది లక్షల రూపాయలు నాగభూషణరావుకి ఇస్తూ 25 లక్షల రూపాయలు కు సంబంధించిన అదే షాపును నాగభూషణరావుకు తనకి ఇవ్వడం జరిగింది. నాగభూషణరావు డబ్బు కృష్ణారావుకు షాపుకు గుడ్ విల్ నిమిత్తము నెలకు 20 వేల రూపాయలు, అప్పుగా తీసుకున్న 10 లక్షల రూపాయలు గాను 10000 రూపాయలు మొత్తం నెలకు 30000 రూపాయలు డబ్బి కృష్ణారావుకు ఇవ్వవలసి ఉంది. అలాగే మరికొంతమంది వద్ద డబ్బులను అప్పుగా తీసుకున్నాడు.అయితే డబ్బు కృష్ణారావుకు నాగభూషణరావు సకాలంలో వడ్డీ ఇవ్వలేకపోవడం వల్ల, తన స్నేహం చెడిపోతుందని ఇతరులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాను అనే భయంతో మనస్థాపం చెంది తేదీ 9. 7 .2025 ఉదయం 4: 30 గంటల సమయంలో తన షాపులో ఫ్యాన్ హుక్కుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఫై రిపోర్ట్ పై సాలూరు టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుని భార్య పద్మావతి పిర్యాదు చేసినట్టు తెలిపారు.