ఎన్నికల హామీలపై బాబు పవన్ లను నిలదీయాలిశాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స

గొల్లప్రోలు జూలై 9 మన న్యూస్ :– ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అమలు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రజలు నిలదీయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసిపి రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు లోని సత్య కృష్ణ ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ వైసిపి సర్వ సభ్య సమావేశానికి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ విచ్చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు, పవన్ లు సంతకాలు చేసి ప్రజలకు బాండ్లు పంపిణీ చేశారని ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు సూపర్ సిక్స్ లోని హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తనదేనని పవన్ కళ్యాణ్ ప్రకటించినా నోరు మెదపడం లేదని విమర్శించారు. అధికార పార్టీ హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమకు ఉందన్నారు. త్వరలోనే పట్టణాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి చంద్రబాబు హామీల మోసాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి ఏడాది రైతులకు 20వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఇవ్వకుండా మోసం చేశారని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలో సొమ్ములు జమ చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడుస్తున్నా సొమ్ములు చెల్లించలేదన్నారు. నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి అమలు చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. గిట్టుబాటు ధర లేక మామిడి, మిర్చి,పొగాకు రైతులు రోడ్డు ఎక్కారన్నారు. వైసిపి నాయకులు,కార్యకర్తలు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. మాజీ మంత్రి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని కూటమి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని వాస్తవానికి గంజాయిని గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చి నాయకులు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారులను సైతం మత్తుకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చి నాణ్యమైన గంజాయిని సైతం అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేశారని సూపర్ సిక్స్త్ హామీలను మాత్రం గాలికి వదిలేసారని ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి గీతా విశ్వనాథ మాట్లాడుతూ ఇతర పార్టీల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగడం అభినందనీయమన్నారు. అంతకుముందు మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో లోని హామీలను, మోసాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, నాయకులు యనమల కృష్ణుడు, రావూరి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబి, గొల్లప్రోలు ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ రామయ్య దొర, జడ్పిటిసి ఉలవకాయల లోవరాజు, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు, పిఠాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి, యు కొత్తపల్లి ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, నాయకులు మొగలి అయ్యారావు, జ్యోతుల బీముడు, మొగలి సాంబశివ, రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..