

మన న్యూస్ సింగరాయకొండ:-
దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు ఈసందర్బంగా మాట్లాడుతూ
రాజీ చేయదగిన సివిల్ కేసులు త్వరతగతిన పరిష్కరించుటకు మూడు నెలలకు ఒకసారి దేశ వ్యాప్తంగా మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, ఇక్కడ రాజీ పడిన కేసులు మళ్లీ అప్పిలు చేయుటకు వీలుకాదని, కనుక కక్షిదారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేసారు.కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నిబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించి కొండేపి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కక్ష దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రాజీవిధానమే రాజీమార్గమని అన్నారు.కార్యక్రమ అనంతరం లోక్ ఆధాలత్ కు హాజరైన వారికి మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశారు.కార్యక్రమములో న్యాయ వాదులు హరి కోటేశ్వరరావు, కె వెంకట నరసింహారావు, బి వెంకటేశ్వర్లు,పంతగాని వెంకటేశ్వర్లు,రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
