

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం పెంపొందించాలని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి తమ సొంత ఊరికి,తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని, ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు తాము చదువుకున్న పాఠశాలను గుర్తుపెట్టుకుని సహాయ సహకారాలు అందించాలని సూచించారు. తాను తమ అమ్మగారి పేరు మీద ప్రతి సంవత్సరం “అమ్మ ఫౌండేషన్” పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు బహుకరించారు. ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ డాక్టర్ బి వి రమణ గారు ఉన్నత విద్యావంతులే కాక ఆధ్యాత్మిక చింతన కలిగిన వారని, వారు జాతీయస్థాయిలో అనేక సేవ పతకాలు అందుకున్నారని అభినందిస్తూ దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అజయ్, విద్యార్థు పాల్గొన్నారు.