

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం లో గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన విజయవాడ లో జరుగనున్న బహిరంగ సభలో కార్మిలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, మున్సిపల్ సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు,గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది.