- పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, భోజన సామాగ్రి పంపిణీఐరాల
ఐరాల ఆగస్ట్ 15 మన ద్యాస (నాగరాజ సరకింటి )
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎం. పైపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.ఎం. పైపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి బాబి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తక సామాగ్రి, భోజన సామాగ్రిని పంపిణీ చేశారు. స్థానిక మాజీ సర్పంచ్ ఎం. ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు.అదేవిధంగా గతంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో నగదు బహుమతులు అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5,000, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.4,000, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.3,000 చొప్పున అందజేశారు.పంచాయతీ పరిధిలోని మోటకం పల్లె, జంగాలపల్లి పాఠశాలలతో పాటు ఎం. పైపల్లె ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, అవసరమైన సామాగ్రిని అందించడం జరిగింది.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంచడంతో పాటు ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రముఖులు పుత్ర మద్ది చంద్రశేఖర్ రెడ్డి, ముదిగోళం సురేంద్రనాథ్ రెడ్డి, పైపల్లె సూరి రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, మునస్వామి రెడ్డి, రత్నం రెడ్డి, కేశవరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.