

మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2
పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి”* మండల నాయకులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం డికే.చెరువు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను అందించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాలన అనేది ప్రజలకు కనిపించేలా ఉండాలని, సంక్షేమ పథకాలు కేవలం అంకెలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చేయడమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పరంగా మార్పులు కనిపించేలా కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తూ నిజమైన పాలనను సూచికగా నిలిచిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్ మరియు ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
