

వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో కళాకారులను ప్రోత్సోహించాలి, హస్త కళలు అంతరించి పోకూడదనేది ముఖ్యమంత్రి లక్యం – ఏ.పి. హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :- హస్త కళాకారులు మంచి జీవనోపాధి పెంపొందించుకోవాలంటే వారు తయారుచేసిన వస్తువులు యొక్క ఉత్పత్తి, లాభం, ప్రచారం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు జిల్లా డా.ఎస్. వెంకటేశ్వర్ , ఎ.పి హ్యాండ్ క్రాఫ్ట్స్ చైర్మన్ డా.హరి ప్రసాద్ తో కలసి డి ఆర్ డి ఎ, డి ఐ సి, లేపాక్షి, శిల్పారామం, టూరిజం, నాబార్డ్ , హ్యాండ్ లూమ్స్, ఖాదీ బోర్డ్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల అధికారులతో మరియు హస్త కళలు, హ్యాండ్ లూమ్స్ కళాకారులు, అసోసిఎషన్, సొసైటీల వారితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల లోని చిన్న కుటుంబాలు నుంచి కూడా ఎంతోమంది హస్త, కళంకారీ కళల పైన ఆధారపడి తమ జీవనోపాధి చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో కలంకారి, హస్త కళలకు, మాధవ మాల, వెంకటగిరి చీరలకు, పాపా నాయుడుపేట పూసల కళాకారులకు దేశవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు రావడం జరిగిందని గర్వంగా ఉందని పేర్కొన్నారు. హస్తకళలకు మంచి డిమాండ్ ఉందని అందువలన వీటికి అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులకు అండగా ఉంటుంది, వారి జీవనోపాధి పెంపొందించే దిశగా కృషి చేస్తుంది అని తెలిపారు. ఉత్పత్తి, లాభం, ప్రచారం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కళాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. లేపాక్షి ఎంపోరియం అభివృద్ధి చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు నందు మన క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ ఉండేలా చూడాలని తెలిపారు. మన జిల్లాలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు జియో టాకింగ్ చేయడం వలన ఆ ఉత్పత్తులను ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారు వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత మరియు ఎగుమతి చేయడం తద్వారా ఆదాయం పెరుగుతుందని అన్నారు. మన కళాకారులకి ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే విధంగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో హస్తకళాకారులు పడుతున్న ఇబ్బందులు వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకుని వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
హస్త కళాకారుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో హస్త కళాకారుల సంబంధించిన సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాకారులను, కళలను కాపాడుకోవాలని అనేది ముఖ్యమంత్రి, , ఉప ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లక్ష్యంతో హస్త కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. అగ్గిపెట్టెలో ఇమిడియెంత నేత నేసిన ఘనత మన కళాకారులది అని తెలిపారు. నెమ్మదిగా కళాకారుల యొక్క ప్రాధాన్యత వెనుకబడి పోతుందని వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. హస్త కళాకారుల యొక్క సమస్యలను తీర్చాలి వారిని ప్రోత్సహించాలనే దిశగా ప్రొడక్షన్, ప్రమోషన్, ప్రాఫిట్ అనే ఉద్దేశంతో వారికి అండగా ఉంటామని తెలిపారు. జిల్లాలో లేపాక్షి అభివృద్ధి దిశగా ఎంపోరియం ను ఏర్పాటు ఉంటుందని అన్నారు. తిరుపతి, తిరుమలలో పర్యాటకులను ఆకర్షించే దిశగా లేపాక్షి షో రూమ్ లను ఏర్పాటు చేయడం వలన జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి పుత్తూరులో ఎక్కువగా కళాకారులు చేత స్వయంగా తయారైన వస్తువులను అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రికి సమర్పించడం జరిగిందని ఇది గర్వించ దగ్గ విషయం అని అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కళలను ఎలా ముందుకు తీసుకో వెళ్లాలి అనే ప్రధాన ఉద్దేశం గా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హస్త కళలను విస్తరింప చేయాలి అని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ ,కలకత్తా లో ఉన్నాయని మంచి హ్యాండ్ క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపారు. మన జిల్లాలో మన కళాకారుల చేత తయారు చేయబడిన వస్తువులకు ప్రాధాన్యత పెరగాలంటే వాటి ప్రమోషన్ చేయడం చాలా అవసరమని, ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి కార్యాలయం నందు హస్తకళల వస్తువులను ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుపతి, తిరుమలకు వచ్చే అతిథులకు లేపాక్షి వస్తువులను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హస్త కళల వస్తువులకు జియో టాకింగ్, E -sharm , Gst మొదలగు సౌకర్యాలు కల్పన వలన ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. జాతీయస్థాయిలో అవార్డు పొందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి జిల్లాను హస్తకళనందు మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. హస్త కళాకారులకు సహాయం చేయడం మొదటి ఉద్దేశం అని వారికి కావలసిన సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామని అన్నారు. మాధవమాలలో పనిచేసే కళాకారులకు వారి జీవనోపాధి పెంపొందించే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని తెలిపారు. వారికి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు వాటి ప్రమోషన్ కూడా చాలా అవసరం అని అప్పుడే వస్తువుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందని తెలిపారు.
సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ , ఎ.పి హ్యాండి క్రాఫ్ట్స్ చైర్మన్తో కలసి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కళంకారీ , హ్యాండి క్రాఫ్ట్స్ శాఖా వారు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించి వాటి తయారీ విధానం గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశ అనంతరరం వుడ్ కార్వింగ్, కళంకారీ , హ్యాండ్ లూమ్స్ రంగాలలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన వివిధ కళాకారులకు జిల్లా కలెక్టర్ సాలువ, మోమెంతో తో అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎ డి హస్తకళలు సత్యమూర్తి, ఎ డి చేనేత వస్త్రాలు రమేష్, ఎ.డి. ఎ.పి.కె.వి.ఐ.బి. వెంకట రావు, ఎ.డి. ఎం.ఎస్.ఎం.ఈ. మూర్తి, ఎల్డిఎం రవి కుమార్, పర్యాటకశాఖ ఆర్ డి రమణ ప్రసాద్, పి డి డి ఆర్ డి ఎ శోభన్ బాబు, ఎ పి డి ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చంద్రశేఖర్, సెట్విన్ సీఈవో మోహన్ కుమార్, కళాశృస్తి ఎన్ జి ఓ దశరథ ఆచారి, బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిస్ట్ దొరస్వామి, జిల్లా అధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
